Telangana Devotional Places

ఆధ్యాత్మిక కేంద్రాలు

బిర్లా మందిరం :

బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ కు దక్షణాన ఉన్న కాళాపహాడ్ మరియు నవత్పహాడ్ అనే కొండలపై నిర్మించబడింది. రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లని పాలరాయితో 1876లో బిర్లాలు ఈ మందిరం నిర్మించారు. ఉత్తర మరియు దక్షిణ వాస్తు శైలుల మిశ్రమ సమ్మేళనం ఆలయం లోపల రామాయణ, మహాభారత చిత్రాలను పాలరాయిపై అద్భుతంగా చెప్పారు. అత్యంత విశాలమైన వెంకటేశ్వరుని గర్భగుడి తిరుమల వెంకటేశ్వరుని గర్భగుడికి ప్రతిరూపంగా చెప్పవచ్చు.

జగన్నాథ ఆలయం :

బంజారాహిల్స్ హైదరాబాదులో ఈ ఆలయం నిర్మించారు. పూరి ఒడిశాలో ఉన్న జగన్నాథ ఆలయం ప్రతిరూపంగా దీనిని చెప్పవచ్చు. ఒడిశా నుంచి తెప్పించిన ఇసుకరాయితో ఈ మందిరం ను నిర్మించారు. దాదాపు 60 శిల్పాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు బలరాముడు, సుభద్రలు ప్రధాన విగ్రహాలుగా చెప్పవచ్చు. దాదాపు 70 అడుగుల ఎత్తైన శిఖరం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

బల్కంపేట ఎల్లమ్మ :

హైదరాబాదులో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంను 15వ శతాబ్దంలో నిర్మించగా 20వ శతాబ్దంలో పునర్నిర్మించారు.

పెద్దమ్మ ఆలయం : 

జూబ్లీహిల్స్ హైదరాబాద్లో నిర్మించారు. దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించారని ప్రతితి.  1993 సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సంవత్సరంనకు ఒకసారి ఇక్కడ బోనాల జాతర నిర్వహిస్తారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయం 200 సంవత్సరాల క్రితం జూలై 1815లో సికింద్రాబాద్లో నిర్మించారు. ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి సూరటి అప్పయ్య 1813లో కలరా వ్యాధి ప్రబలిన కారణంగా ఉజ్జయినిలో ఉన్న సూరటి అప్పయ్య మహంకాళి ఆలయం ను సందర్శించుకొని కలరా నుండి ప్రజలను విముక్తి కలిగిస్తే మీ విగ్రహాన్ని సికింద్రాబాద్లో ప్రతిష్టిస్తాం అని పూజ చేశారు. ఆ విధంగా 1815లో సికింద్రాబాద్లో మహంకాళి విగ్రహమును ప్రతిష్టించారు. అందుకే దీనికి ఉజ్జయిని మహంకాళి ఆలయం అని పేరు.

సంఘి ఆలయం :

సంఘి ఆలయం రంగారెడ్డి జిల్లా సంఘీనగర్ లో ఉన్న అద్భుతమైన పాలరాయి ఆలయం. ప్రధానంగా పూజింపబడే దేవుడు వెంకటేశ్వర స్వామి. పరమానందగిరి అనే కొండ పైన ఈ ఆలయం నిర్మించారు. గోపురం ఎత్తు 15 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం చోళ చాళుక్య వాస్తు శైలిలో నిర్మించారు.

అనంత పద్మనాభ స్వామి ఆలయo : 

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లోని అనంతగిరి కొండలపై ఈ ఆలయం ఉంది. స్కంద పురాణం ప్రకారం మార్కండేయుడు అనే రుషి ద్వాపర యుగంలో ఈ ఆలయం నిర్మించారు. ప్రధానాలయమును నిర్మించినది హైదరాబాద్ నవాబ్ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.

చిలుకూరు బాలాజీ టెంపుల్ : 

ఈ ఆలయం కు ఉన్న మరొక పేరు వీసాగాడ్. ఉస్మాన్ సాగర్ రోడ్డున రంగారెడ్డిలో నిర్మించబడింది. 11 ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోగా అవి నెరవేరితే 108 ప్రదక్షిణలు చేయాలి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ నమ్మకం పై ఒక ఆర్టికల్ కూడా రాసింది. కానుకలను స్వీకరించని దేశంలోని అతి కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి.

జ్ఞాన సరస్వతి దేవాలయం: 

ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధానంగా లక్ష్మీ ,సరస్వతి కాళీ దేవతలు కొలువై ఉన్నారు. వ్యాసమహర్షి కారణంగా ఈ ఆలయం వెలిసింది అని ప్రతీతి. ఆయనపేరా ఈ గ్రామానికి బాసర అనే పేరు వచ్చింది. బాసర ప్రస్తుత ఆలయంను నిర్మించింది కర్ణాటక రాజు బీర్బలుడు. అక్షరాభ్యాసానికి అనుమైనా ఆలయం.
భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి ఒడ్డున భద్రాచలం రామాలయానికి ప్రసిద్ధి. ప్రస్తుతాలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. సీతాదేవి అడుగు, మారీచకుని ముద్రలు ఇక్కడ కనిపిస్తాయి.

యాదగిరిగుట్ట : 

ఇటీవల దీని పేరును యాదాద్రిగా మార్చినారు. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. కొండపైన నిర్మించిన నరసింహస్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. దాదాపు 30000 నుంచి 50 వేల మంది భక్తులు రోజు సందర్శించుకుంటారు. దీనిని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు తన జీవిత చరిత్రలో ఈ ఆలయం గురించి పేర్కొన్నాడు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 100 కోట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మరో 16 ఎకరాలలో పార్కులు కళ్యాణ మండపాలు, ధ్యాన కేంద్రాలు వేద పాఠశాలలు కాలేజీలు నిర్మించనున్నారు, 400 ఎకరాలలో నరసింహ జింకల అభయారణ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు.

సురేంద్రపురి ఆలయం : 

యాదాద్రికి దగ్గరలో ఉంది. ఇక్కడ దేశంలోని అనేక ప్రధాన ఆలయాలు మరియు విగ్రహాల నమూనాలతో దీనిని ఏర్పరచినారు. అత్యంత ఎత్తైన పంచముఖ హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.

భద్రకాళి ఆలయం

వరంగల్ లో ఉన్న అతి పురాతన అమ్మవారి ఆలయాలలో ఇది ఒకటి. భద్రకాళీ సరస్సు ఒడ్డున ఈ ఆలయం ఉంది. దీనిని 625 ఏ.డిలో చాళుక్యరాజు పులకేసి 2 నిర్మించాడు. చాళుక్య వాస్తు శైలిలో ఈ ఆలయం నిర్మించారు.

వేములవాడ:

రాజరాజేశ్వరాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ ఆలయం ఉంది. వేములవాడ చాళుక్యులు ఈ ఆలయం నిర్మించారు. 9 నుండి పదవ శతాబ్దంలో వేములవాడ చాళుక్యుల రాజధానిగా ఉండేది. శివుడు రాజరాజేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడు. వేములవాడ భీమకవి 11వ శతాబ్దం ఈ ప్రాంతానికి చెందినవాడు. కోడె ముక్కు ఈ ఆలయం ప్రత్యేకత. ఆలయంలోపల దర్గా ఉండడం లౌకికత్వానికి ప్రతీక అని అనుకుంటారు. కానీ హిందువుల అతి మంచితనం.

కొండగట్టు: 

కొండగట్టు జగిత్యాలజిల్లా కొండగట్టులో అత్యంత ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయం ఉంది. 300 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 40 రోజుల హనుమాన్ దీక్ష అత్యంత ప్రసిద్ధి చెందింది.

కాళేశ్వరం: 

ముక్తేశ్వరాలయం కరీంనగర్ జిల్లా కాలేశ్వరం లో ఈ ఆలయం ఉంది. త్రిలింగాలలో ఇది ఒక ప్రదేశం. ద్రాక్షారామం, శ్రీశైలం ఇక్కడ శివుని ప్రతిరూపమైన రెండు లింగాలు పానపట్టంను కలిగి ఉండటం ప్రత్యేకత. శివాలయంతో పాటు ముక్తేశ్వరాలయం,యముడు కూడా ఉండడం ఇంకొక ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి త్రివేణి సంగమం చూడవచ్చు. ఇక్కడ చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రధాన ఆలయాలు:

కీసర గట్టు ఆలయం, కర్మాంఘాట్ హనుమాన్ ఆలయం, రంగారెడ్డి డిచ్పల్లి రామాలయం, కంటేశ్వరాలయం. నిజామాబాద్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ధర్మపురి జగన్నాథ ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం. అదిలాబాద్ ఛాయా సోమేశ్వరాలయం. నల్గొండ కోటిలింగేశ్వర ఆలయం. ఏడుపాయల వనదుర్గ ఆలయం, మెదక్ వంటి ఇంకా ఎన్నో దేవాలయాలు ఆధ్యాత్మిక టూరిజానికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.

Leave a Comment