Telangana Districts

Telangana Districts : మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండిస్వపరిపాలన చేసుకుంటున్నాము.

అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of statue ని ఏర్పాటు చేయడం జరిగినది. ఐతే ఆ సంస్థానాలన్నింటిని ఒక్కటిగా చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. కానీ అందులో వివిధ ప్రాంతాల వారు వివిధ భాషలు మాట్లాడే వారు ఒకే రాష్ట్రం లో ఉండడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి.

అందుకని మళ్ళీ అప్పుడు ఉన్న రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం జరిగింది. భాషాప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఆంధ్ర రాష్ట్రం గా ఉండేది. ఆ తర్వాత 1 november 1956 రోజున హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఆంధ్ర నాయకులు  తెలంగాణ నాయకులను, ప్రజలను చాలా విషయాలలో అన్యాయానికి గురి చేశారు. భూముల విషయంలో, నీటి పంపిణీ లో, ఉద్యోగాల విషయంలో అన్నింటిలో వారిదే ఆధిపత్యం చెలాయించడం వలన తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం జరిగింది. అందుకని రాష్ట్రం ఏర్పడిన 5 సంవత్సరాలకే ముల్కీ ఉద్యమం తో మొదలుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. దాన్నే మనం మొదటి దశ తెలంగాణ ఉద్యమం అంటాము.

ఆ తరువాత మళ్ళీ 2001 లో కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా TRS పార్టీ స్థాపించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 వరకు ఎంతో మంది మేధావులు, నాయకులు, సబ్బండ వర్ణాల ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చివరికి తెలంగాణ చిరకాల కోరిక అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలతో కూడిన మరియు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  2 జూన్ 2014 రోజున ఆవిర్భవించింది.

ఆ తరువాత 2016 అక్టోబర్ 11 వ తేదీన 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించడం జరిగింది. తరువాత ప్రజల కోరిక మేరకు మరొక 2 జిల్లాను దశల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ 33 జిల్లాలతో ఉంది. ఐతే కొందరికి ఈ 33 జిల్లాల  పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంది. అందుకని పాత పది జిల్లాల నుండి ఏ జిల్లా నుండి ఏ ఏ జిల్లాలు విభజించబడినవో తెలుసుకుంటే సులభంగా 33 జిల్లాల పేర్లు గుర్తు పెట్టుకోవచ్చు .

ఇప్పుడు ఏ జిల్లా నుండి ఏ జిల్లాలు ఏర్పడినవో చూద్దాం.

Telangana Districts

అదిలాబాద్ : 

1 అదిలాబాద్ 2 నిర్మల్ 3 కొమురం భీమ్ ఆసిఫాబాద్ 4 మంచిర్యాల

నిజామాబాద్: 

5  నిజామాబాద్ 6 కామారెడ్డి

కరీంనగర్ :

7 కరీంనగర్ 8 జగిత్యాల 9 రాజన్న సిరిసిల్ల 10 పెద్దపల్లి

వరంగల్: 

11 రూరల్ వరంగల్ ( హనుమకొండ )  12 అర్బన్ వరంగల్ ( వరంగల్) 13 జయశంకర్ భూపాలపల్లి 14 జనగాం 15 ములుగు 16 మహబూబాబాద్

ఖమ్మం:

17 ఖమ్మం 18 భద్రాద్రి కొత్తగూడెం

నల్గొండ:

19 నల్గొండ  20 యాదాద్రి భువనగిరి 21 సూర్యాపేట

మహబూబ్ నగర్:

22 మహబూబ్ నగర్ 23 నాగర్ కర్నూల్ 24 జోగులాంబ గద్వాల్ 25 వనపర్తి 26 నారాయణ పేట్

రంగారెడ్డి:

27 రంగారెడ్డి 28 వికారాబాద్ 29 మేడ్చల్

మెదక్:

30 మెదక్ 31 సిద్దిపేట 32 సంగారెడ్డి

33 హైదరాబాద్

5 thoughts on “Telangana Districts”

  1. Ruling prajalaku daggarai works easy ga avutunnai,prajalaku chala melu ga undi
    So finally present government district’s tagginchadam Manu kovali,lekunte mally Baga udyamalu serious ga vastai,so government care full ga undali

Leave a Comment