ఖుదీరామ్ జీవిత చరిత్ర
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలోనే 200 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉరి తీయబడ్డారు. కుదిరామ్ బోస్ బ్రిటీష్ వారి చేత ఉరి తీయబడినప్పుడు అతని వయసు 18 సంవత్సరాల 8 రోజులు. ఖుదిరామ్ బోస్ 1889 డిసెంబర్ 3న బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ దగ్గరగా ఉన్న హబీబ్ పూర్ అనే చిన్న గ్రామంలో త్రైలోక్యనాథ్ లక్ష్మీ ప్రియ బోస్ లకు నాలుగవ సంతానంగా కుదిరంబోస్ జన్మించాడు.
అతను విప్లవాత్మక లక్షణాలను చిన్నప్పటినుండి గమనిస్తూ సాహసం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1902-1903 లో అరబిందో మరియు సోదరి నివేదిత స్వాతంత్ర సంగ్రామం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు అతను ప్రేరణ పొందాడు. క్రియాశీల రాజకీయాల్లోకి దిగాడు. తమ్లుక్ లోని విద్యార్థి విప్లవ సమూహాలలో భాగంగా ఉండేవాడు.
అతని సోదరి అపురూప భర్త అమృత్ ను తమ్లుక్ నుండి మిడ్నాపూర్ కు బదిలీ చేసినప్పుడు ఖుదిరామ్ 1904లో మిడ్నాపూర్ కాలేజీయేట్ పాఠశాలలో చేరేందుకు అతని వెంట వెళ్లాడు. సామాజిక, రాజకీయ రంగాలలో కొత్తగా ఏర్పడిన మరియు పోషించిన ‘అఖారా’లో చేరాడు. సత్యేంద్రనాథ్ బోస్ చేత ప్రభావితమయ్యాడు. చాలా ఉత్సాహంతో చురుకైన నాయకుడు అయ్యాడు ఖుదిరామ్. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఖుదిరాం చేసిన పోరాటాన్ని బ్రిటిష్ రాజు ఖండించాడు. విప్లవాత్మక కార్యకర్తల జుగంతర్ పార్టీలో చేరాడు. అతను పోలీస్ స్టేషన్లలో బాంబులు వేశాడు. మరియు తన పదహారేళ్ళ వయసులో ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా చేసుకున్నాడు. బాంబుదాడులకు మూడేళ్ల తర్వాత అతన్ని అరెస్టు చేశారు.
స్నేహితుడు ప్రపుల్ల చాకితో కలిసి కింగ్స్ ఫోర్డ్ పై దాడి చేయడానికి బీహార్ లోని ముజఫర్ లోని మోహితిహిల్ దగ్గరకు వెళ్ళాడు. హరేన్ సర్కార్ ( ఖుదీరాం ) మరియు దినేష్ రాయ్ ( ప్రపుల్లా) మారుపేరులతో వారు కిశోరీ మోహన్ బందోపాధ్యాయ నివాసం ” వద్ద ఆశ్రయం పొందాడు. దాడి సమయంలో అమాయకులను చంపకుండా ఉండటానికి వారు కింగ్స్ ఫోర్డ్ యొక్క దిన చర్యను చూడటానికి సమయం తీసుకున్నారు. ఏప్రిల్ 30 1908 రాత్రి వారు కింగ్స్ ఫోర్డ్ ప్రయాణిస్తున్నాడని భావించి బండిపై దాడి చేశారు. బదులుగా ఇద్దరు మహిళలు భార్య మరియు న్యాయవాది ప్రిన్గిల్ కిన్నెడీ కుమార్తె చనిపోయారు. రైల్వేస్టేషన్లో ఇద్దరు విడిపోయారు. పోలీసుల వలన ప్రపుల్ల చాకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్తిపూర్ నుండి 20 కిలోమీటర్లు పూసా బజార్ నుండి 12 కిలోమీటర్లు (ఇటీవల ఈ ఊరికి కుదిరాంబోస కేఆర్బి పూస అని పేరు పెట్టారు ) దూరంలో అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఖుదిరాం రైలు ఎక్కడానికి బదులు మిడ్నాపూర్ నడవాలని నిర్ణయించుకున్నాడు. ‘ఓయని’ అనే స్థలంలో అతను అలసిపోతున్నందున నీరు త్రాగడానికి ఒక టీ స్టాల్ దగ్గరగా ఆగాడు. కానిస్టేబుళ్లు అతన్ని చూశారు. వారి అనుమానం పెరిగింది. వారు ఖుదిరాం వద్ద రెండు రివాల్వర్లు 37 రౌండ్ల మందు గుండు సామాగ్రి ఉన్నట్టు మే 1, 1908న అతన్ని అరెస్టు చేశారు. అంతకుముందు 1906 విప్లవత్మక పత్రిక సోలార్ బంగ్లా పంపిణీ చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు. కానీ అతను పోలీసులను గాయపరచకుండా తప్పించుకున్నాడు. మరియు అతని లేత వయస్సు కారణంగా నిర్దోషిగా ప్రకటించాడు కానీ ఈసారి ఖుదిరాం తప్పించుకోలేకపోయాడు.
1908 మే 21న వివాదం ప్రారంభమైంది. ఉపేంద్రనాథ్ కాళిదాసు బస్ వంటి ప్రముఖ న్యాయవాదులు సమర్ధించారు. తన న్యాయవాదుల సలహా మేరకు కుదిరామే 23న తన మొదటి ప్రకటనలో బాంబుదారులకు పాల్పడలేదని చెప్పారు. విచారణ నెమ్మదిగా సాగింది. కోర్టు మరణశిక్షను విధించింది అప్పిలు చేయడానికి ఇష్టపడక పోయినప్పటికీ అతని న్యాయవాదుల పట్టుదలపై హైకోర్టులో విచారణ జూలై 8, 1908 జరిగింది. తుది తీర్పు 1908 జూలై 13 న ఆయన శిక్షణ జీవిత ఖైదుగా మార్చండి అని ప్రకటించింది. ఆగస్టు 11, 1908 చిరునవ్వుతో ఉరిని కోరుకున్నాడు. ఈ సంఘటనగరంలోని అందరికీ తెలిసింది అందరూ కుదిరాం ధైర్యాన్ని ప్రశంసించారు. ఖుదిరాం కి క్షమాభిక్ష పెట్టాలని చాలామంది గవర్నర్ జనరల్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. ఖుది రామ్ మరణశిక్ష దేశంలో బ్రిటీష్ పాలన యొక్క దౌర్జన్యం మరియు క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుంది అతన్ని జీవిత ఖైదు చేసి ఉరి తీసిన ముజఫర్ జైలుకు ‘ఖుదిరంబోస్ మెమోరియల్ సెంట్రల్ జైలు’ అని పేరు పెట్టారు. ఇది యువ స్వాతంత్ర సమరయోధుడు ఖుదిరామ్ బోస్ జీవిత చరిత్ర.
అందువల్ల స్వాతంత్ర్యము పెద్దపెద్ద నాయకులచే మాత్రమే రాలేదు. కుదిరం వంటి అనేకుల త్యాగాల ఫలితంగా వచ్చింది ప్రఖ్యాత నాయకులను జ్ఞాపకం చేసుకుంటూ కుదిరంబోసు వంటి యువ అమరవీరులను మరణం మరిచిపోకూడదు