HMPV( హ్యూమన్ మెటప్న్యూమో వైరస్):
2020 నుండి 2022 వరకు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ గురించి మరిచిపోకముందే మళ్ళీ మరొక చైనా వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అదే ఈ HMPV అంటే హ్యూమన్ మెటప్న్యుమో వైరస్ . 2024 డిసెంబర్ లో మొదటగా పిల్లల్లో శ్వాస కోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అని ఆరా తీయగా దానికి HMPV వైరస్ కారణం తెలిసింది. ఈ విషయం తెలియగానే ప్రపంచదేశాలు మరొక్క సారి ఉలిక్కిపడ్డాయి. విషయం తెలియగానే అన్ని దేశాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఇప్పుడు ఈ వైరస్ మన భారత దేశంలోకి కూడా వ్యాపించింది అని సమాచారం. ఈరోజు బెంగుళూరు మొదటిసారిగా ఇద్దరు చిన్న పిల్లలకి HMPV వైరస్ సోకిందని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా వెలువరించింది. మరియు గుజరాత్ లో కూడా ఒక కేసు నమోదు అయిందని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం తో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో , వయసు పైబడిన వృద్ధుల్లో శ్వాసకోశ నాలాలపై దాడి జరుపుతుంది. తద్వారా శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధ పడే ప్రభావం ఉంది. ఇది ఎక్కువైతే ప్రాణానికే ప్రమాదం.
HMPV చరిత్ర :
దీని పూర్తి పేరు హ్యూమన్ మెటప్న్యూమో వైరస్. దీనిని మొదటగా 2001 లో నెదర్లాండ్స్ లో గుర్తించడం జరిగింది . తరువాత మళ్ళీ 2016 లో అమెరికాలో 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్లో ఈ వైరస్ నీ గుర్తించడం జరిగింది. ఇది సాధారణంగా చిన్న పిల్లలు, వృద్ధులకి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేయడం జరిగింది. ఈ HMPV వైరస్ మేటప్న్యుమో జాతి , రిబోవిరియా రాజ్యానికి మరియు మొంజీవిరిసెట్స్ తరగతి కి చెందింది.
దీనిని మొదటగా 2001 లో నెదర్లాండ్స్ లోని బెర్నాడేట్ జి. వాన్ డెన్ హుగన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మొదటగా నెదర్లాండ్స్ లోని 28 మంది చిన్నారులు శ్వాసకోశ నాళాలలో కనుగొనబడింది. ఇది ముఖ్యంగా సమా శీతోష్ణ ప్రాంతాలలో శీతాకాలంలో మరియు వసంత కాలంలో విరుచుకుపడుతుంది. ఇన్ఫ్లుఎంజా వైరస్ నీ పోలి ఉంటుంది.
ఏదీ ఏమైనప్పటికీ ముందు కరీనా వైరస్ ప్రారంభ దశలో కూడా ఇలాగే శీతాకాలంలో మాత్రమే ప్రభావం చూపుతుంది అని అన్నారు. కానీ తరువాత కాలం ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రపంచాన్ని కుదిపేసింది. అందుకని ముందు జాగ్రత్తగా మనమే కరోనా కి పాటించిన జాగ్రతలు పాటించాలి. లేకపోతే మనకి ఇబ్బందులు తప్పవు.