సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021
Civil Registration System: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021 ను 7, మే 2025 న విడుదల చేసింది.
నివేదిక ముఖ్య అంశాలు :
దేశంలో 2021 జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. జననాల్లో మగ పిల్లల వాటా 52.2% ఆడపిల్లల వాటా 47.8%గా నమోదయింది. 2021 జనన నమోదు రిజిస్టర్ ఆధారంగా లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా 1000 : 901-925 నమోదయింది.
ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 976 ఉంటే, తర్వాత స్థానాల్లో కర్ణాటక కేరళ, ఉత్తరాఖండ్ ఝార్ఖండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అండమాన్, లక్షదీప్ 951-975 వరకు ఉన్నాయి. దేశంలో మాతృత్వ మరణాల రేటు ప్రతి 1, లక్ష ప్రసవాలకు 2014-2016లో 130 ఉండగా, 2021 నాటికి 93 కు తగ్గింది. దేశంలో మధ్య ప్రదేశ్ 175, అస్సాం 162, ఉత్తరప్రదేశ్ 151, ఒడిశా 106, రాజస్థాన్ 102, బీహార్, ఉత్తరాఖండ్ లో 100 అత్యధికంగా మాతృ మరణాలు నమోదుతున్నాయి. అతి తక్కువ మాతృ మరణాలు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కేరళ 20 మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 38 తర్వాత తెలంగాణ 45, ఆంధ్రప్రదేశ్ 46, తమిళనాడు 49, ఝార్ఖండ్ 51, గుజరాత్ 53, కర్ణాటక 63 తర్వాత స్థానాల్లో ఉన్నాయి. శిశు మరణాల రేటు 2014లో 1000 జననాలకు 39 మరణాలు ఉండగా 2021 నాటికి 27కు తగ్గినట్లు ఎస్ ఆర్ ఎస్ పేర్కొంది.
నవజాత శిశువుల్లో మరణాల రేటు 2014కి 1000 కి 26 ఉండగా, 2021 నాటికి 19కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2014లో 1000 కి 45 ఉండగా 2021 నాటికి 31 తగ్గిందని వివరించింది. మొత్తం 77.7% పట్టణాల్లో 22.3% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 2021 కి శిశు మరణాల్లో మగ పిల్లల సంఖ్య 79,442 గా ఉంటే, ఆడబిడ్డల సంఖ్య 57, 176 గా ఉంది. 2021లో నమోదైన 2.0% సంతానోత్పత్తి రేటు స్థిరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 72.9% జననాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావి శిక్షణ పొందిన మిడ్ వైఫ్, నర్స్, శిక్షణ పొందని మిడ్ వైఫ్ ఆధ్వర్యంలో నమోదు అవుతున్నాయి. 2030 నాటికి ఎనిమిది రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ను సాధిస్తాయని నివేదిక తెలిపింది.
2021 లో దేశవ్యాప్తంగా 21 లక్షల మేర పెరిగిన మరణాలు
సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక -2021 ప్రకారం కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో వ్యాపించిన 2021 లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మరణాలు నమోదు అయ్యాయి. 2021 లో దేశవ్యాప్తంగా 1.02 కోట్ల మంది చనిపోయారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 21.08 (25.08%) లక్షలు అధికం. దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల (2012-2021) డేటాను పరిశీలిస్తే మరణాల్లో 0.84% నుంచి 9.93% వరకు పెరుగుదల నమోదు కాగా2021 లో మాత్రం ఏకంగా 25.98% పెరుగుదల కనిపించింది. 2021లో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 60.8% పురుషులు 39.2% మహిళలు ఉన్నారు.
Civil Registration System తెలంగాణ:
తెలంగాణలో 2021 లో మొత్తం 6.11 లక్షల మంది జన్మించారు. అందులో 3,18, 300 మంది మగ పిల్లలు, 2,93,400 మంది ఆడపిల్లలు పుట్టారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాల్లో 95,668 మంది పుడితే, అత్యల్పంగా ములుగు జిల్లాలో 3,868 మంది పిల్లలు జన్మించారు. హైదరాబాద్ తర్వాత మేడ్చల్ 35,424, నిజామాబాద్ 34,818, రంగారెడ్డి 29,816, వరంగల్ అర్బన్ 27,604 వరుసగా నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతంలోని జననాల రేటు ఎక్కువగా ఉంది. 2021 లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది జన్మిస్తే, పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టారు. ఆ ఏడాది మొత్తం 3.18 లక్షల మంది శిశువులు, 2.93 లక్షల మంది ఆడ శిశువులు జన్మించారు. తెలంగాణలో 2021 లో మొత్తం 23,425 చనిపోగా, అందులో 1.35 లక్షల మంది పురుషులు, 98,000 మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,08,327 మంది చనిపోతే, పట్టణ ప్రాంతాల్లో 1,26,098 మరణించారు. 2021లో హైదరాబాద్లో అత్యధికంగా 41,451 మంది చనిపోతే, నిజామాబాదులో 16,796, హనుమకొండలో 16522, ఖమ్మం లో 11984 మంది మృత్యువాత పడ్డారు.
నవజాత శిశువుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1,871, మంది కన్నుమూస్తే, పట్టణ ప్రాంతాల్లో 4,410 మంది చనిపోయారు.
మొత్తంగా 6,281 మంది చనిపోయారు. తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టిన వారు పల్లె ప్రాంతాలు 1,989 మంది ఉంటే పట్టణాల్లో 4,062 గా మంది ఉన్నారు.
నజాత శిశు మరణాలు ఎక్కువగా హైదరాబాదులో సంభవించాయి. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ జిల్లాల్లో 1,805 మంది నవజాత శిషువులు చనిపోతే, పెద్దపల్లి జిల్లాల్లో 158 మంది కన్నుమూశారు.
గర్భస్థ శిశువుల మరణాలు హైదరాబాద్ లోనే ఎక్కువగా జరిగాయి. ఈ మేరకు హైదరాబాదులో 1,310, నిజాంబాద్ లో 1,172 మరణాలు సంభవించాయి.
చిన్నారి పుట్టిన తర్వాత నిబంధనల మేరకు 21 రోజుల్లో జననాన్ని నమోదు చేయాలి.
ఇలా రిజిస్టర్ చేసుకుంటున్న వారి సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉంది. 50 – 80% జననాలు మాత్రమే సకాలంలో నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం జననాల సంఖ్య 2020లో 71,4017 ఉండగా, 2021 లో 7,37,189 పెరిగింది. అది 2 3 1 7 2 లేదా దాదాపు 3.2% పెరుగుదల జిల్లాల వారీగా చూస్తే 2021లో తూర్పుగోదావరి అత్యధికంగా 74,765 జననాలు నమోదు అయ్యాయి.
ఆ తర్వాత కర్నూలు 88,914 మరియు గుంటూరు 67,565 ఉన్నాయి. దీనికి భిన్నంగా విజయనగరం 32,023, శ్రీకాకుళం 36,290 లో తక్కువ జననాలు నమోదు అయింది.