Blood Pressure

రక్త పీడనం ( Blood pressure )

రక్తం రక్తనాళాలలో ప్రవహించేటపుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడినే రక్తపీడనం అంటారు. దీన్ని స్పిగ్నోమానోమీటర్ ద్వారా కొలుస్తారు. దీన్ని మొదట శామ్యూల్ కార్ట్ రిట్టర్ 1881 లో కనుక్కున్నాడు.

ఈ స్పిగ్నో మానోమీటర్ లో పాదరసాన్ని ఉపయోగిస్తారు.

రక్త పీడనం = 120/80 mm of Hg

సిస్టోల్ పీడనం : 120mm of Hg

డయాస్టోల్ పీడనం : 80 mm of Hg

ఇవి మళ్ళీ రెండు రకాలు :

1. High B.P ( Hyper Tesnsion):

రక్త నాళాలలో కొలెస్టరాల్ పేరుకుని పోతే వ్యాసం తగ్గి ఒత్తిడి ఎక్కువగా ఉండటాన్ని High B.P అంటారు. Note: ఉప్పును ఎక్కువగా వినియోగించడం వలన రక్త నాళాల విప్పారం తగ్గి రక్తపోటు పెరుగును.

  2. Low B.P ( Hypo Tension) :

రక్త పరిమాణం తక్కువగా ఉన్న వ్యక్తులలో ఒత్తిడి తక్కువగా ఉండటాన్ని Low B.P అంటారు.

గుండె పోటు ( Heart Attack) : 

హృదయ కండరాలకు రక్తాన్ని అనగా ఆహారం , ఆక్సిజన్ సరఫరా చేసే ధమని అయిన ‘కరోనరీ / హృదయ ధమని ‘ కి ఏమైనా అవాంతరాలు ఏర్పడినపుడు కండరాలకు ఆక్సిజన్ , ఆహారం సరఫరా కాక గుండె తాత్కాలికంగా ఆగిపోవడాన్ని ‘ గుండె పోటు ‘ అంటారు. దీన్ని Silent Killer అని కూడా అంటారు. హృదయంలో జరిగే విద్యుత్ ప్రకంపనలను అనగా పని చేసే వేగాన్ని తెలియచేసే పరికరం : E.C.G ( Electro Cardiograph) 

ఈ పరికరాన్ని కనుగొన్నది – బంధోవెన్

గుండె పోటుకు కారణం : ఒత్తిడి , స్థూలకాయం , డయాబెటిస్, స్మోకింగ్ , ఆల్కహాల్ .

గుండెపోటు లక్షణాలు : ఛాతీ నొప్పి, అంతర రక్త స్రావం, పల్స్ సక్రమంగా లేకపోవడం, ఉష్ణోగ్రత త్వరగా పెరగడం.

కరోనరీ ధమని వ్యాధి లేదా ఎథిరో స్కిరోటిక్ గుండె వ్యాధి :

కరోనరీ ధమనులలో కాల్షియం ,కొవ్వులు, తంతు కణజాలం పేరుకుని కుహురం ఇరుకుగా మారడం వల్ల ఇది కలుగును. దీని ఫలితంగా గుండెకి రక్త ప్రవాహం తగ్గడాన్  ‘ ఇస్చీమియ ‘ అంటారు.దీనివల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ అందక చనిపోవడాన్ని మమోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా గుండె పోటు అంటారు.

Note : హృదయ కణజాలం స్థానికంగా మరణించడాన్ని నెక్రోసిస్ అంటారు.

అంజినా పెక్టోరిస్:

ఇది ఇస్చీమియతో సంభవించే చాటి నొప్పి . ఈ నొప్పి గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గిందని తెలియచేసే ప్రమాద సూచిక. ఇది వయసుతో పనిలేకుండా సంభవిస్తుంది. గుండె శరీర అవసరాలకు సరిపడ రక్తాన్ని పంప్ చేయలేక ,పనిచేయని స్థితిని హృదయ వైఫల్యం లేదా Heart failure అని అంటారు.

Leave a Comment