భారత పౌరసత్వ చట్టం (CAA ) – 2019
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 ను దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది ఈ మేరకు 2024 మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధృవీకరణ పత్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం 2019 ఉద్దేశం. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 2019లో పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.
కాలక్రమంలో పౌరసత్వ సవరణ చట్టం :
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చింది దేశంలోని పౌరులందరికీ పౌరసత్వానికి హామీ ఇచ్చింది మతం ఆధారంగా ఎటువంటి భేదం చూపలేదు. 1955లో భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని ఆమోదించింది కొన్ని పరిమితులకు లోబడి దేశంలో జన్మించిన పౌరులందరికీ పౌరసత్వం కల్పించబడింది. విదేశీయులు భారత పౌరసత్వం పొందడానికి కూడా అవకాశం కల్పించింది. అవిభాజ్య భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులకు భారతదేశంలో ఏడు సంవత్సరాల నివాసం తర్వాత రిజిస్ట్రేషన్ కు మార్గం చూపబడింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి భారత దేశంలో 12 సంవత్సరాల నివాసం తర్వాత సహజసిద్ధంగా పౌరసత్వం కల్పించారు. 1971 కి ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులందరికీ కొన్ని నిబంధనలకు లోబడి పౌరసత్వం మంజూరు చేస్తూ 1985లో పౌరసత్వ చట్టం మొదటిసారి సవరించబడింది అనంతరం 1992 2003 2005లో చాలా విస్తృతంగా సవరించారు.
కాగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్లో మతపరమైన హింసను అనుభవిస్తున్న హిందువులు,సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే పౌరసత్వ సవరణ బిల్లుకు బిజెపి ప్రభుత్వం 2016 లోనే ప్రవేశపెట్టింది. 2016లో జూలై 19న లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు 2016 గా ప్రవేశపెట్టారు 2016 ఆగస్టు 12న బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు 2019 జనవరి 9న కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది 2019 జనవరి 8న లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ పరిశీలన మరియు ఆమోదం కోసం ఉండగా 16వ లోక్సభ రద్దు కావడంతో బిల్లు మురిగిపోయింది. 2019 డిసెంబర్ 4న 17వ లోకసభ కాలంలో పౌరసత్వ సవరణ బిల్లు 2019 కి ఆమోదము లభించింది. 2019 డిసెంబర్ 9న లోక్సభలో అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదము పొందింది. 2019 డిసెంబర్ 11న రాజ్యసభ సీఏఏ బిల్లును ఆమోదించింది 2019 డిసెంబర్ 12న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా రూపొందింది. ఈ మేరకు 2024 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
CAA చట్టం – 2019 అర్హతలు – నిబంధనలు:
- 2014 డిసెంబర్ 31కి ముందు మతపరమైన హింస కారణంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్ శరణార్థులు ఇందుకు అర్హులు.
- 2014కు ముందు కనీసం ఏడాది నుంచి భారత్ లో ఉంటున్న వాళ్లకు 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్ళకు భవితత్వం కల్పించారు ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదు ఈ మేరకు పౌరసత్వ చట్టం 1955 కు నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరణలు చేసింది.
- అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు సిఏఏ 2019 చట్టం పరిధి నుంచి మినహాయించారు.
- సిఏఏ చట్టం 2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని ఆన్లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.
CAA నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఆయాదేశాల్లో తమకు ప్రస్తుతం ఉన్న పౌరుషత్వాన్ని వదులుకోవడంతోపాటు భారతదేశంలో శాశ్వత చిరునామాగా అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి. విధేయతతో కూడిన ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది అలాగే వారు హిందూ సిక్కుజైన బౌద్ధ పాసింజర్ క్రైస్తవ మతాలకు చెందిన వారిని ప్రస్తుతం ఆయా మతాల్లోనే కొనసాగుతున్నారని ధ్రువీకరిస్తూ గుర్తింపు పొందిన ఏదైనా స్థానిక సంస్థ జారీచేసిన అర్హత సర్టిఫికెట్ను సమర్పించాలి. వీటితోపాటు పౌరసత్వం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్ జన్మదిన ధ్రువీకరణ పత్రం లేదా ఏదైనా లైసెన్స్ లేదా భూమి లేదా కవులు రికార్డులు లేదా స్టడీ సర్టిఫికెట్లు అక్కడి ప్రభుత్వాలు మంజూరు చేసిన మరి ఏదైనా గుర్తింపు పత్రంతో పాటు దరఖాస్తుదారుని తల్లిదండ్రులు లేదా తాతలు ముత్తాతలు ఒకరు ఆయా దేశాలకు చెందిన వారిని నిరూపించే ఏదైనా పత్రం దరఖాస్తుదారులు ఆయా దేశాల నుంచి వచ్చినట్లు నిర్ధారించేందుకు అక్కడి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఏ పత్రం నైనా ఆమోదిస్తారు. ఒకవేళ వాటి కాలపరిమితి దాటినా కూడా అవి చెల్లుబాటు అవుతాయని నిబంధనలో పేర్కొన్నారు.
భారత్లో స్థానికతక నిరూపణకు:
దరఖాస్తుదారుడు 2014 డిసెంబర్ 31 కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించినట్లుగా రుజువు చేసేందుకు భారత్కు వచ్చిన సమయంలోని వీసా కాపీ, ఇమిగ్రేషన్ స్టాంపు కాపీలు, గ్రామీణ పట్టణ సంస్థలకు ఎన్నికైన సభ్యులు లేదా రెవెన్యూ అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం భారత్లో జనగణన సమయంలో అన్యుమరేటర్లు జారీచేసిన స్లిప్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు స్కూల్ తీసి విద్యార్హత సర్టిఫికెట్లు వ్యాపార లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
పౌరసత్వ సవరణ చట్టం (CAA) – 2019 కింద భారత ప్రభుత్వం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారికోసం కేంద్ర హోంశాఖhttps://indiancitizenshiponline.nic.in/ పేరుతో ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. పాక్ ఆఫ్ గాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 2014 డిసెంబర్ 31 ముందు ఇక్కడికి వలస వచ్చిన హిందువులు సిక్కులు, జైలు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం మంజూరు కోసం https://indiancitizenshiponline.nic.in/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- సీఏఏ దరఖాస్తులకు 1032 నెంబర్ గల హెల్ప్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది.
- పౌరసత్వ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. పౌరసత్వం మంజూరుకు 30 జిల్లాల కలెక్టర్లకు తొమ్మిది రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శిలకు ఇదివరకు అధికారాలు ఇచ్చారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఏ జిల్లా అధికారులకు ఇలాంటి అధికారం ఇవ్వలేదు.
- సీఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకుని సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు.
- సీఏఏ కింద అర్హులైన వారికి చట్టంలో పేర్కొన్న ప్రకారం రెట్రోస్పెక్టివ్ విధానంలో పౌరసత్వం మంజూరు చేయనున్నారు.