ధ్వని
ఏదైనా ఒక కంపన వస్తువు నుండి ధ్వని జనిస్తుంది. ఇది యాంత్రిక తరంగాలలో ప్రయాణిస్తుంది. ధ్వని ప్రయాణించేటప్పుడు గాలిలో కణాల కంపన దశ తరంగ ప్రయాణిశలోనే ఉంటుంది. కాబట్టి ధ్వని తరంగాలు అనుదైర్జ్య తరంగాలు. గాలిలో ధ్వని ప్రసారాన్ని మొదటగా వివరించింది న్యూటన్. ధ్వని అధ్యయన శాస్త్రాన్ని అకౌటిక్స్ అని అంటారు.
యాణకం:
కనములు కలిగియున్న పదార్థములను యానకం అంటారు. ఈ యానకం ఘన, ద్రవ,వాయు స్థితిలలో ఏ స్థితిలోనైనా ఉండవచ్చు. యానకం లేకుండా ధ్వని తరంగాలు ప్రయాణించవు. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు ఇవి శూన్యంలో ప్రయాణించలేవు.
తరంగం:
యానకం యొక్క కణాల కంపన చలనం వల్ల కలిగే శక్తిని ఒక బిందువు నుండి మరొక బిందువుకు మోసుకెళ్ళే దానిని తరంగం అంటారు.
తరంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు:
తరంగధైర్ఘ్యం :
ఒక పూర్తి తరంగం ప్రయాణం చేసిన దూరం అనగా రెండు వరుస సంపీడనాల(విరలికరనాలు) లేదా రెండు వరుస శృంగాల (ద్రోనుల) మధ్య దూరాన్ని తరంగధైర్ఘ్యం అంటారు. దీనిని lamda చే సూచిస్తారు.
ప్రమాణాలు: అంగస్ట్రాం , సెంటిమీటర్, మీటర్.
కంపన పరిమితి:
యానకంలోని కనము తన విరామ స్థానం నుండి ప్రయాణించే గరిష్ట దూరాన్ని కంపన పరిమితి అంటారు. దీనికి ప్రమాణాలు మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్
ఆవర్తన కాలం :
తరంగం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. ప్రమాణాలు: సెకండ్.
తరంగ వేగం :
ఒక సెకండ్ కాలంలో తరంగం ప్రయాణించిన దూరాన్ని తరంగవేగమని అంటారు. ప్రమాణాలు మీటర్ ఫర్ సెకండ్.
దశ ప్రావస్థ (Phase ): అంతరాళంలో ఒక బిందువు వద్ద తరంగం యొక్క తాత్కాలిక స్థితిని ప్రావస్థ అందురు
దశా బేధం: తరంగంలోని ఏవైనా రెండు బిందువుల వద్ద గల దశల మధ్య తేడాను దశా బేదం అంటారు.
పౌన పుణ్యం:
ఒక సెకండ్ కాలంలో తరంగం చేసే డోలనాల సంఖ్యను పౌనపుణ్యం అంటారు. దీనిని హెడ్జ్లలో కొలుస్తారు.
సహజ పౌన పుణ్యం:
ప్రతి వస్తువుకి శక్తిని పొందిన ప్రతిసారి ఒక ప్రత్యేక పౌన పుణ్యంతో కనిపిస్తుంది. ఈ పవన పుణ్యాన్ని సహజ పౌనపుణ్యం అంటారు. ఈ కంపనాలను సహజ కంపనాలు అని అంటారు.
అవరుద్ద డోలనాలు : క్రమంగా కంపణ పరిమితి తగ్గిపోయే డోలనాలను అవరుద్దోలనాలు అంటారు
బలాత్కృత కంపనాలు : ఒక వస్తువుపై బాహ్యబలాన్ని పదే పదే ప్రయోగిస్తే ఆ వస్తువు ప్రయోగించిన బలానికి అనుకూలమైన పవనపుణ్యంతో కంపనాలు చేస్తుంది. ఇటువంటి కంపనాలను బలాత్కృత కంపనాలు అంటారు.
అనునాదం :
ఒకే సహజ పవన పుణ్యం గల రెండు వస్తువులలో ఒక దాన్ని కంపింపజేస్తే రెండవ వస్తువు కనిపించడాన్ని అనునాదం అంటారు.
అనునాదం బలాత్కృత కంపనాలలో ఒక ప్రత్యేక సందర్భం. ఉదాహరణకు వీధిలో బస్సులు, లారీలు వెళ్లేటప్పుడు తలుపులు, కిటికీలు కనిపించడం. రేడియో, టీవీలను ట్యూనింగ్ చేయడం. అనునాదం వలన వంతెన కూలిపోయే ప్రమాదం ఉండడంతో కవాతు చేస్తూ వంతెన పైకి వస్తున్న సైనికులు వంతెన పై సాధారణంగా నడుస్తారు.
తరంగాల రకాలు:
తరంగాలు ప్రయాణించే విధానం ఆధారంగా తరంగాలను మూడు రకాలుగా విభజించారు.
- పురోగమి తరంగాలు: అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి అనంతంగా ముందుకు సాగిపోయే తరంగాలలో పూర్వగామి తరంగాలు అంటారు.
పురోగమి తరంగాలు మరల రెండు రకాలు ఒకటి అను ధైర్ఘ్య తరంగాలు, రెండు తిర్యక్ తరంగాలు. - తిరోగమితరంగాలు: అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి బయలుదేరి ఏదైనా ఒక బిందువు నుండి వెనుకకు వచ్చే తరంగాలను తిరగని తరంగాలు అంటారు. ఉదాహరణకి నీళ్లతో ఉన్న బకెట్ను తట్టినప్పుడు తరంగాలు బకెట్ అంచులను తాగి పరావర్తనం చెందిన తరంగాలు.
- స్థిరతరంగాలు : రెండు పురోగమి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే స్థిరతరంగాలు ఏర్పడతాయి ఉదాహరణకు అనునాదం చెందే గాలి స్తంభం పై తరంగాలు.
తరంగాలు స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా విధించారు. 1. యాంత్రిక తరంగాలు 2. విద్యుత్ అయస్కాంత తరంగాలు.