Science

1. ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగుని ఎందుకు వాడుతారు..?

ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేంటంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు ఎక్కువ తరంగధైర్ఘ్యం ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసారమవుతూ ఉంటాయి. అలల రూపంలో వెళుతున్న తరంగాలలో వరుసగా ఉన్న రెండింటి మధ్య దూరమే తరంగధైర్ఘ్యం. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న రాయిని వదిలితే చిన్నతరంగాలు, పెద్ద రాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడినట్లు చిన్నతరంగాలకు తక్కువ తరంగధైర్ఘ్యం, పెద్ద తరంగాలకు ఎక్కువ తరంగధైర్ఘ్యం ఉంటుంది. పెద్ద తరంగాలు ఎక్కువ దూరం కనిపించడానికి కారణం వాటి తరంగధైర్యమే. రంగులు కనిపించే విషయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది. ఎక్కువ తరంగధైర్ఘమున్న ఎరుపు రంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందువల్లే ప్రమాద సూచికగా ఎరుపు రంగును వాడుతారు.

2. క్రికెట్ ఎప్పుడు మొదలైంది?

క్రికెట్కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు క్రికెట్ 600 సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది. మొదటి క్రికెట్ పోటీ జూన్ 18 1744 సంవత్సరంలో కెంట్, లండన్ జట్ల మధ్య జరిగింది మొదట్లో నియమాలు ఉండేవి కాదు. తర్వాత నియమ నిబంధనలు రూపొందించారు. వికెట్ల మధ్య పొడవు 22 గజాలు, వెడల్పు పది అడుగుల దూరం ఉండేలా నిర్ణయించారు. వికెట్లు మొదట రెండు కర్రలతోనే ఉండేది. బ్యాట్ కూడా ఇప్పటిలాగా కాకుండా హాకీ బ్యాట్ ఆకారంలో ఉండేది. తరువాత చాలా మార్పులు జరిగి ఇప్పుడున్న స్థితికి వచ్చింది.

3. విమానం నడిపే పైలెట్లకు దారి ఎలా తెలుస్తుంది..?

ఒక గ్రాఫ్ కాగితం తీసుకుని దాని మీద ఎక్కడో ఒక చోట ఒక చుక్క పెట్టండి. ఆ కాగితం మీద ఉండే అడ్డు గీతాలు నిలువుగీతలు ఆధారంగా ఆ చుక్క ఎక్కడుందో మీరు చెప్పగలరు. అలాగే మన భూగోళం మొత్తాన్ని కూడా అడ్డంగా, నిలువుగా ఉండే ఊహా రేఖలతో విభజించారు. వీటినే అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. వీటి ఆధారంగా భూమి మీద ఉండే ఏ ప్రాంతాన్ని నైనా గుర్తించే విధానాన్ని తొలిసారిగా హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం లో కనిపెట్టాడు. విమానం నడిపే పైలెట్లకు తామున్న చోటు నుంచి ఏ దిశలో ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్లు చెబుతాయి. ఓడరేవుల నుంచి విమానాశ్రయాలనుంచి నిరంతరం రేడియో తరంగాల ద్వారా సంకేతాలు అందుతూ ఉంటాయి. వీటన్నిటిని ఆధారంగా వీరు తమ దిశను మార్పు చేసుకుంటూ ముందుకు సాగుతారు .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top