మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండి స్వచేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of statue ని ఏర్పాటు చేయడం జరిగినది. ఐతే ఆ సంస్థానాలన్నింటిని ఒక్కటిగా చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. కానీ అందులో వివిధ ప్రాంతాల వారు వివిధ భాషలు మాట్లాడే వారు ఒకే రాష్ట్రం లో ఉండడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకని మళ్ళీ అప్పుడు ఉన్న రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం జరిగింది. భాషాప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఆంధ్ర రాష్ట్రం గా ఉండేది.
వారికి రాజధాని లేని కారణంగా మరియు తెలంగాణ ప్రాంతం అనగా అప్పటికి ఉన్న హైదరబాద్ రాష్ట్రం విద్య పరంగా చాలా వెనుక బడిన ప్రాంతం మరియు హైదరబాద్ రాష్ట్రం లో ఎక్కువ భాగం తెలుగు మాట్లాడేవారు అధికం. అందుకని ఆంధ్రప్రాంతం హైదరబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రం గా చేయాలని అప్పటి నాయకులు ఆలోచించారు. కానీ ఇది తెలంగాణ ప్రజలకు ఏ మాత్రమూ ఇష్టం లేదు. అప్పుడు కేంద్రం లో ఉన్న నెహ్రూ ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందం ఏర్పాటు చేసి ఎన్నో మీటింగ్ లు ఏర్పాటు చేసి అయిష్టంగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రం 1956 నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది.
ఆ తరువాత 1956 నుండి 2014 వరకు తెలంగాణ, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉన్నాయి. మళ్లీ 2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, 2014 జూన్ 8వ తేదీన ప్రస్తుత విభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గా ఏర్పడింది .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల తో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 13 జిల్లాలుగా ఉంది.
ఎన్నో సమస్యలతో విభజించబడిన రాష్ట్రం 5సంవత్సరాల వరకు జిల్లాల విభజన ఆలోచన చేయలేదు. 2019 లో ఏర్పడిన YSR ప్రభుత్వం జిల్లాల విభజనపై దృష్టి పెట్టింది. 2022 జనవరి 26 వ తేదీన జిల్లాల పునర్విభజన కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నో అభ్యంతరాలు, సలహాలు తీసుకున్న తర్వాత 2022 ఏప్రిల్ 4వ తేదీన 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా విభజించబడ్డాయి . ఒక్కో జిల్లా కనీసం రెండు జిల్లాగా విభజించబడినాయి .
ఐతే పూర్వపు 13 జిల్లాల నుండి ఇప్పుడు ఉన్న 26 జిల్లాలు ఏ ఏ జిల్లాల నుండి విభజించబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వపు 23 జిల్లాల పేర్లు
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) విశాఖపట్టణం
4)తూర్పు గోదావరి
5) పశ్చిమ గోదావరి
6) కృష్ణా
7) గుంటూరు
8 ) నెల్లూరు
9) ప్రకాశం
10) కడప
11) చిత్తూరు
12) కర్నూల్
13 ) అనంతపురం
ఇప్పుడు ఏ ఏ జిల్లాల నుండి ఏ ఏ జిల్లాలు జిల్లాలు ఏర్పడినవో చూద్దాము.
[ ] శ్రీకాకుళం : 1.శ్రీకాకుళం
[ ] విజయనగరం : 2 విజయనగరం 3. పార్వతీపురం మన్యం జిల్లా
[ ] విశాఖపట్టణం : 4. విశాఖపట్నం 5.అల్లూరి సీతారామరాజు
[ ] తూర్పు గోదావరి : 6.తూర్పు గోదావరి 7.అనకాపల్లి 8.కోనసీమ
[ ] పశ్చిమ గోదావరి: 9.పశ్చిమ గోదావరి 10. రాజమండ్రి 11. నర్సాపూర్
[ ] కృష్ణా : 12 కృష్ణ 13. ఎన్టీఆర్
[ ] గుంటూరు: 14. గుంటూరు 15. బాపట్ల
[ ] నెల్లూరు: 16.నెల్లూరు
[ ] ప్రకాశం : 17.ప్రకాశం 18. పల్నాడు
[ ] కడప: 19. కడప 20. అన్నమయ్య
[ ] చిత్తూరు: 21.చిత్తూరు 22. బాలాజీ తిరుపతి.
[ ] కర్నూల్: 23. కర్నూల్ 24. నంద్యాల
[ ] అనంతపురం: 25. అనంతపురం 26. పుట్టపర్తి