నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు D : 22/07/2024
➡️ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ నేటి నుంచి సమావేశం కాబోతోంది.
➡️ అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాట్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు.
➡️ అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.
➡️ మహాకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు.
➡️ నేడు దాశరథి శత జయంతి “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
➡️ రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
🏆 క్రీడా వార్తలు 🏆
ఆసియా కప్లో భారత మహిళల జట్టు యూఏఈ పై ఘన విజయం.
📖 నేటి సూక్తి📖
ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు .
🩺 ఆరోగ్య చిట్కా 🩺
ఆకుకూరల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.
📖నిన్నటి జీకే📖
ఝార్ఖండ్ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి?
జవాబు:- హేమంత్ సోరేన్.
🌎 నేటి జీకే 🌍
ఇటీవల దక్షిణ భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందిన రైల్వే జోన్ పేరేంటి?