తెలంగాణ పర్యావరణ పర్యాటకం
తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలు
1) హుస్సేన్ సాగర్:
తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైన వాటిలో హుస్సేన్ సాగర్ ప్రముఖమైనది.
ఇబ్రహీం కుతుబ్షా అల్లుడు హుస్సేన్ షావలి (1562 ఎ.డి) దీనిని నిర్మించాడు.
మానవ నిర్మిత చెరువు. దీని ప్రక్కనే లుంబినీ పార్కు ఉన్నది.
ట్యాంక్ బండ్ పైన గల చారిత్రక విగ్రహాలు పర్యాటకులకు రాష్ట్ర చరిత్ర
సాగర్ మధ్యలో ఉన్న ఏకశిలా బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.
ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన బుద్ధుని ఏకశిలా విగ్రహం.
దీనిని ఎన్.టి.రామారావు కాలంలో ప్రతిష్టించారు.
బుద్దుని విగ్రహం 58 అడుగుల పొడవు 350 టన్నుల బరువుతో ఉంట
బోటింగ్, పారాసెయిలింగ్, సెయిలింగ్, స్పీడ్ బోటింగ్ సాగర్ ప్రత్యేకతా
2) దుర్గం చెరువు :
హైదరాబాద్ నవాబుల రహస్య సరస్సుగా దీనిని పిలుస్తారు.
రమణీయమైన పచ్చిక బయళ్ళ దక్కన్ పీఠభూమి యొక్క అద్భుతమైన E దాదాపు 63 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది.
గాలం వేయడం, బోటింగ్, ట్రెక్కింగ్, ఫుడ్కోర్డ్స్ వంటివి అదనపు ఆకర్షణ.
3) ఉస్మాన్సాగర్ :
1920లో ఉస్మాన్ అలీఖాన్ మూసీనది పైన డ్యాం కట్టడం వలన ఏర్పడి.
మూసినది వరదల వల్ల హైదరాబాద్ను రక్షించటానికి, హైదరాబాద్ ప్రజ అందించటానికి దీనిని నిర్మించారు.
ఉస్మాన్ సాగర్ ను అత్యధికులు పిలిచే పేరు – గండిపేట్.
దీని ఒడ్డున గల అతిధి గృహం – సాగర్ మహల్,
4) నాగార్జున సాగర్ :
నల్గొండ జిల్లా నందికొండ గ్రామంలో ఈ ప్రాజెక్టు ఉంది.
దేశంలో అతిపెద్ద రాతి నిర్మిత డ్యాం.
నాగార్జునాచార్యుడు అనే ప్రముఖ బౌద్ధ గురువు ఇక్కడ ఉండడం వలన వచ్చింది.
వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో నాగార్జున సాగర్ ప్రకృతి ప్రే వరప్రసాదం లాంటిది.
1969లో పూర్తి అయిన ఈ డ్యాం ఎత్తు 124 మీ॥, 1 కి. మీ|| పొడవు, 42 గేట్లను కలిగి ఉంది.
ప్రఖ్యాతి గాంచిన మ్యూజియం, ప్రకృతి రమనీయత, బోటింగ్ ప్రత్యేక ఆకర్షణ.
5) కుంటాల జలపాతం:
ప్రదేశం: కుంతాల (నేరెడిగొండ మండలం, అదిలాబాద్)
దీని ఎత్తు – 147 అడుగులు (లేదా) 45 మీ.
తెలంగాణలోనే ఎత్తైన జలపాతం.
దీని పేరు దుష్యంతుని భార్య శకుంతల పేరు మీద వచ్చిందని ప్రతీతి.
తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలు
6) అనంతగిరి కొండలు :
రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు 10 కి.మీ దూరంలో అనంతగిరి కొండలు ఉంటాయి.
తెలంగాణలో ఉన్న దట్టమైన అడవులలో ఇది ఒకటి.
మూసినది జన్మస్థానం ఇక్కడే.
పురాతన గుహలు, మధ్యయుగపు కోటలు, పురాతన దేవాలయం ఈ ప్రాంత చరిత్రను తెలుపుతాయి.
వేసవి కాలంలో ఈ ప్రాంతాన్ని ‘పేదవాడి ఊటీ’గా పిలుస్తారు.
ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రమట్టి సాహసోపేతమైన ఆటలకు అనుకూలమైనది. ఇక్కడ ట్రెక్కింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
7) మల్లారం అడవులు:
నిజామాబాద్ నైరుతి దిశలో ఈ అడవులు ఉన్నాయి.
ఈ దట్టమైన అడవులు పర్యావరణ పర్యాటకులకు గమ్యస్థానంగా మారాయి.
ఈ అడవిలో ట్రెక్కింగ్ మరియు వ్యూ పాయింట్ టవర్ ప్రత్యేక ఆకర్షణ.
మల్లారం చెరువు వీక్షణకై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు..
ఈ అడవిలో 1.45 బిలియన్ సం॥ల క్రితం కు చెందిన పుట్టగొడుగు ఆకారంలో ఉన్న పురాతన శిల ఉంది.
8) కనకాయి జలపాతం:
ఆదిలాబాద్ జిల్లాలోని బజారాతా్నూర్ మండలంలో ఉన్న గర్నార్ గ్రామం దగ్గర ఈ జలపా ఉంది.
దీనికి కనకదుర్గ జలపాతం అని పేరు కూడా ఉంది.
కనకదుర్గ ఆలయం, జలపాతం, అరుదైన పక్షులు నది ఇరువైపుల ఉన్న దట్టమైన భో వృక్షాలు ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలు
9) లక్నవరం చెరువు:
వరంగల్ కు 70 కి.మీ ల దూరంలో గోవిందరావు పేట మండలంలో ఈ చెరువు ఉంది.
ఈ చెరువు 3 ఇరుకైన లోయల కలయిక వలన ఏర్పడింది.
ఈ చెరువును 13వ శతాబ్దంలో కాకతీయులు గుర్తించి నీటిపారుదలకై అభివృద్ధి చేశారు
వేలాడే బ్రిడ్జి ద్వారా చెరువు మధ్యలో ఉన్న చిన్న ద్వీపం చేరుకోవచ్చు.
బోటు రైడింగ్, వేలాడే బ్రిడ్జి, చుట్టు పచ్చని పంటపొలాలు ఈ చెరువుకు ప్రత్యేక ఆకర్షణ
10) పాకాల చెరువు:
వరంగల్ తూర్పున 50 కి.మీల దూరంలో ఈ చెరువు ఉంది.
భూమిపై స్వర్గంను చూడాలనుకుంటే వెన్నెల రాత్రులలో ఈ చెరువును చూడాలి అని లోకోక్తి.
30 చ.కి.మీ ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
1213 ఎ.డిలో కాకతీయ పాలకుడు గణపతి దేవుడు నిర్మించాడు.
దట్టమైన అడవులతో కూడిన కొండలు ఈ చెరువు చుట్టు ఆవరించాయి.
11) మల్లెలతీర్థం జలపాతం:
ప్రకృతి నిజమైన వరప్రసాదంగా ఈ జలపాతంను పిలుస్తారు.
మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ జలపాతం ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో ఒక అందమైన లోయలో ఈ జలపాతం ఏర్పడింది.
సంవత్సరం పొడవునా ఈ ప్రదేశం అందంగా ఉంటుంది.
నదిని దాటడం, ట్రెక్కింగ్, స్లైడింగ్, క్యాంప్ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.